ఉన్నట్టుండి జేసీబీలు తెచ్చి ధ్వంసం చేస్తారా..?
ఉన్నట్టుండి జేసీబీలు తెచ్చి ధ్వంసం చేస్తారా..?
నెల్లూరులో షాపుల నిర్వాహకుల ఆవేదన, ఆందోళన..
========================///
నెల్లూరులోని నవాబు పేట బీవీఎస్ స్కూల్ ప్రహరీని అనుకుని ఉన్న మన్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ను కార్పొరేషన్ అధికారులు కూల్చేశారు. బీవీఎస్ స్కూల్ విస్తీర్ణం పెంచేందుకు దుకాణాలను తొలగిస్తున్నట్టుగా కార్పొరేషన్ అధికారులు నోటీసులు అంటించారు. అయితే షాపుల నిర్వాహకులు మాత్రం దీన్ని తీవ్రంగా తప్పుబట్టారు. 19వతేదీన నోటీసులు ఇచ్చినట్టు పేర్కొన్నారని, రెండురోజుల్లో ఎలా పడగొడతారని ప్రశ్నించారు. ప్రతి మూడేళ్లకోసారి షాపులు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని, ఓ పథకం ప్రకారం 2018 తర్వాత రెన్యువల్ ఆపేశారని వాపోయారు. షాపుల్లో లక్షల రూపాయల విలువ చేసే సరుకు ఉందన్నారు. జేసీబీలతో పడగొడుతుంటే.. కనీసం ఎమ్మెల్యే కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరూ అక్కడికి రాలేదని, తమకు ఎవరు న్యాయం చేస్తారని ప్రశ్నించారు.